నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 06 : మారుమూల గ్రామాల ప్రజలు కొత్త వ్యక్తులు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్సై అనిల్ కుమార్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లి మండలం రేణుమాకులపల్లి పంచాయతీ మిట్ట మాలపల్లి లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎక్కడైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మకాలు, కోడి పందాలు, జూదాలు జరిగితే మా దృష్టికి తేవాలన్నారు. పగటిపూట వ్యాపారాలు పేరుతో గ్రామాల్లో తిరిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే మా దృష్టికి తేవాలని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళలు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠినమైన చట్టాలు మోపి అమలు చేస్తామన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది, శ్రీనివాసులు, రాజేష్, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News