Wednesday, 29 July 2026 11:03:15 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

Date : 05 June 2026 02:45 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందిన విషాదకర ఘటన శుక్రవారం బి.కొత్తకోట మండల పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో పీటీఎం మండలం పిడింవారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు పీటీఎం మండలం పిడింవారిపల్లికి చెందిన రెడ్డప్ప కుమారుడు కొండ ఉదయ్ కుమార్ (20) తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా లేక బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైందా అనే విషయాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ గోపాల్ రెడ్డి తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు విచారణలో తేలనున్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థి ఉదయ్ కుమార్ ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చేతికి అందివచ్చిన కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి మృతితో పిడింవారిపల్లె గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.ఫోటో క్యాప్షన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొండ ఉదయ్ కుమార్.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :