Tuesday, 15 September 2026 12:53:22 AM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

టిడిపి లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం - పోలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి

Date : 25 November 2025 07:54 PM Views : 400

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 25 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తంబళ్లపల్లె పరిశీలకుడు పోలంరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మల్లయ్య కొండ కింద టిడిపి మండల కమిటీ ఎన్నిక ప్రక్రియ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి క్రమశిక్షణ కు మారుపేరని గ్రూపు రాజకీయాలు తగవని కార్యకర్తల అభిప్రాయ సేకరణతో అధిష్టానం ఆదేశాల మేరకు మండల కమిటీ ఎన్నిక జరుగుతుందన్నారు. కార్యవర్గం ఎవరైనా ప్రతి కుటుంబ సభ్యుడు పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుండెల్లో పెట్టుకుంటుందని హితవు చెప్పారు. స్పెషల్ అబ్జర్వర్ ఆర్టీసీ జోన్ చైర్మన్ నాగరాజు మాట్లాడుతూ పార్టీలో అలకలు మాని ఐకమత్యంతో పని చేయాలని మండలంలో అన్ని విభాగాలలో మొత్తం 974 మంది పార్టీ పదవులు ఉంటాయని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ పదవులు కోసం కచ్చితంగా సభ్యత్వంతో పాటు కే ఎస్ ఎస్ సభ్యుడై ఉండి పార్టీ కోసం కష్టపడి ఉండాలన్నారు. మండల అబ్జర్వర్ టీజే వెంకటేష్ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు మండల కమిటీ ఎన్నిక జరుగుతుందని గతంలో జరిగిన గ్రామ కమిటీలలో లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తెస్తే పునః పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం మండల పార్టీ కన్వీనర్ పోస్ట్ కు సుమారు 13 మంది దరఖాస్తు చేసుకోగా క్లస్టర్ ఇంచార్జీలు, మండల కమిటీ సభ్యులుగా దరఖాస్తు చేయడానికి టిడిపి సభ్యులు పోటీలు పడ్డారు. మండల కమిటీ ఎన్నికలకు వచ్చిన దరఖాస్తులు అధిష్టానం పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని నాయకులు, కార్యకర్తలు గ్రూపులు వీడి పార్టీ పటిష్టతతో బాటు ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్,రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసి ధర్నాయుడు,మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత నియోజకవర్గం ఉపాధ్యక్షుడు నరసింహులు, క్లస్టర్ ఇన్చార్జీలు కాలా నారాయణ,బేరి శ్రీనివాసులు, సోమశేఖర్, పురుషోత్తం, మీసాల భాస్కర్ నాయుడు, ఎర్రసానిపల్లి రామచంద్రారెడ్డి . తాటిరెడ్డి . మ్యూజికల్ శివ , కన్యమడుగు సిద్ధారెడ్డి కోటికొండ రాజేష్, రెడ్డప్ప , కోటకొండ గురుమూర్తి ,ీరాంజనేయులు,మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :