Thursday, 16 April 2026 04:40:21 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పెద్దేరు ప్రాజెక్ట్ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తాం - ఎఫ్.డి.ఓ. నరేంద్రబాబు.

Date : 18 March 2026 08:10 PM Views : 74

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : తంబళ్లపల్లె మండలంలోని పెద్దేరు ప్రాజెక్టు మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరేంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు సమీపంలోని గంగిరెడ్డిపల్లి శ్రీ మద్దెమ్మ ఆలయంలో మత్స్యకారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులు ప్రాజెక్టులో చేప పిల్లలు వదలాలని,ప్రభుత్వం నుండి చేపల వలలు, మినీ బోట్లు, లైఫ్ జాకెట్లు, బ్యాగులు, ద్విచక్ర వాహనాలు, మార్కెటింగ్,బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సభ్యత్వం కలిగిన మత్స్యకారులు ప్రాజెక్టు చేపల వేట డిపాజిట్ సొమ్ము వెంటనే చెల్లించాలని సూచించారు. అదేవిధంగా పెద్దేరు ప్రాజెక్టు పరిధిలోని 23 కులాల మత్స్యకారులు సభ్యత్వం చేసుకోవడానికి సహకరిస్తానని చెప్పారు. పెద్దేరు ప్రాజెక్టు లో చేపల వేటతో జీవనం సాగిస్తున్న మత్స్యకారుల సమస్యలు తన దృష్టికి తెస్తే ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని చైర్మన్ కొటాల శివకుమార్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో విలేజ్ ఫిషరీస్ అనలిస్ట్ అనితా సాయి, మత్స్యకారులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :