నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నియోజకవర్గం వైకాపా కు సంబంధించి నామినేటేడ్ పదవులు ప్రకటించారు. ఈ సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బి.కొత్తకోట కు చెందిన అభిలాష్ రెడ్డి ని నియమించినట్లు వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువరించారు. వైకాపా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ , పార్టీ వెన్నుదన్నుగా ఉండటంతో ఈ పదవి లభించిందని అభిలాష్ తెలిపారు.ఈ సందర్భంగా అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ నా పై పెట్టిన ఈ నమ్మకాన్ని వమ్ము కాకుండా చూస్తానని, నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారికి, రాజంపేట ఎం.పి. పి.వి. మితున్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వర్యులు పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారికి అభిలాష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Namitha News