నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దమండ్యం మండలంలోని పెన్షన్ లబ్దిదారులు , కలిచెర్ల సుధాకర్ రెడ్డి , ఎంపీపీ పూర్ణ చంద్రిక , వైసీపీ కార్యకర్తలు , అధికారులు పాల్గొన్నారు . కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి గారు లేని లోటు చాలా బాధాకరం గా ఉంది , కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సేవలను కొనియడిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి . నేడు నూతనంగా మంజూరైన 38 పెన్షన్లు తో పాటుగా మొత్తం 5677 మంది లబ్ధిదారులకు మూడువేల రూ సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుండీ సామాజిక పెన్షన్లు నెల కు మూడు వేల రూ ప్రభుత్వం అందిస్తున్నది , పెద్దమండ్యం మండలం లో 5677మంది లబ్ధిదారులకు రూ కోటి 70లక్షల 31వెయ్యి రూ మంజూరు చేసిన ప్రభుత్వం , ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన అధికారులు , తమ ప్రభుత్వం అర్హతే ప్రామాణికముగా సంక్షేమ పథకాలను మీ ఇంటిముంగిటికే అందిస్తున్న ఘనత సి.యం జగన్మోహన్ రెడ్డి ది . పెద్దమండ్యం మండలం లో గతం తో పోల్చుకోండి గ్రామ , గ్రామానికి రోడ్డు వేయించాం , ముదివేడు రిజర్వాయర్ ను నిర్మిస్తుండగా అడ్డుకున్న తెలుగుదేశం మన నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసిందో గుర్తుకు తెచ్చుకోండి , చంద్రబాబు 14 సం ముఖ్యమంత్రి , 19 సం ప్రతిపక్ష నేత ఉండి మన నియోజకవర్గం అభివృద్ధి ని ఏనాడు పట్టించుకోలేదు . ఈ మండలం లో చేసిన అభివృద్ధి మీకే కనబడుతోంది . మీకు మేలు చేసిఉంటే , మీకు లబ్దిచేకూరింటే నే మమ్మల్ని ఆదరించండి , మేలు చేసిన మన జగన్మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రి ని చేసుకోవాల్సిన అవసరం ఉంది ...
Admin
Namitha News