Sunday, 13 September 2026 06:10:43 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందా ...?

ఊహించని ఫలితాలే ఇందుకు నిదర్శనం - డాక్టర్ ఎస్ కె బాషా

Date : 16 November 2025 12:15 PM Views : 260

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15 : బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓట్ చోరీ దాగుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ కె బాషా అన్నారు. శనివారం తన కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ దేశం లో వివిధ రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తుండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై విసృతంగా ప్రచారం నిర్వహించడం తో పాటు, సాక్ష్యలతో అదారాలు బయట పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే పోలింగ్ ముగిసే చివరి సమయం లో ఓటు శాతం విజయావకాశాల పై తీవ్రంగా ప్రభావితం చేయడం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఇదే తరహాలో ఫలితాలు రావడం పైన ప్రజల్లో అనుమానాలు బల పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషనర్ పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ రాజిలేని పోరాటం కోన సాగిస్తుందన్నారు. తెలంగాణా లో కాంగ్రెస్ పార్టీ విజయం పై రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, ముఖ్య మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు. ఎపి లోను 2029 జరిగే ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ ని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ఇప్పటి నుండి ప్రత్యేక కార్యాచరణ తో పార్టీ శ్రేణులను సమయాత్తం చేస్తామన్నారు .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :