నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె / బి.కొత్తకోట - సెప్టెంబర్ 11 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల లోని ప్రజల సమస్యలపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం బి కొత్తకోట లోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజా దర్బార్ సమావేశంలో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత వైకాపాలనలో చేసిన భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని హెచ్చరించారు. రెండు దశాబ్దాలుగా తంబళ్లపల్లె రాజకీయ జీవితంలో నియోజకవర్గంలో ఒక్క సెంటు భూమి లేదని ఎక్కడి నుండో వచ్చిన వలస నాయకులకు వందలాది ఎకరాలు ఎలా వచ్చాయని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ఏడు సంవత్సరాలుగా టిడిపి, కూటమి నాయకులు తో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల పరిధిలో ప్రతి సమస్యను ప్రతి శాఖ అధికారి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. వారానికి ఒక్కసారి ప్రజల సమస్యలపై జరిగే రివ్యూ మీటింగ్ లో సమస్యలు నా దృష్టికి రాకూడదని హుకుం జారీ చేశారు.అనంతరం ప్రజా దర్బార్ లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను ఆలకించి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, ఉపాధి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించడానికి సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలను టిడిపి కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కారానికి నాతో పాటు మా నాయకులు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సైతం ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన 2047 విజన్ స్థాపనకు సహకరించాలన్నారు.ఈ ప్రజా దర్బార్ లో మహిళా నాయకురాలు పర్వీన్ తాజ్, ఆరు మండలాల టిడిపి మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ ను ఆరు మండలాల నుండి తరలివచ్చిన నాయకులు ఘనంగా సత్కరించారు
Reporter
Namitha News