Monday, 08 June 2026 08:29:28 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మిట్స్ విద్యార్థులకు జావా ప్రోగ్రామ్ లపై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం

Date : 06 April 2026 09:38 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 06 : అంగళ్ళు సమీపంలో గల డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం మరియు మిట్స్ ఐ.ఐ.సి వారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం జావా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శశాంక్ విద్వాన్, సీనియర్ టెక్నికల్ ట్రైనర్, బైట్స్ ఇండియా కంపెనీ, కోయింబత్తుర్, తమిళనాడు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఐటీ రంగంలో జావా డెవలపర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో కెరీర్ అవకాశాలను విస్తరించడానికి జావా ఒక బలమైన పునాది అని అన్నారు. సాఫ్ట్‌వేర్ నిపుణులుగా ఎదగాలనుకునే విద్యార్థులకు జావా ప్రోగ్రామింగ్ చాలా ముఖ్యమని అన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్లు, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లలో జావా విస్తృతంగా ఉపయోగించబడుతున్న నేపథ్యంలో, ఈ భాషలో ప్రావీణ్యం సాధించడం అత్యంత అవసరమని తెలిపారు. కార్యక్రమంలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌లు, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్‌పై ప్రాక్టికల్ శిక్షణ అందించడంతో పాటు స్ప్రింగ్, హైబర్నేట్ వంటి ఆధునిక ఫ్రేమ్‌వర్క్‌లపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రాక్టికల్ ప్రాజెక్టులు, కోడింగ్ వ్యాయామాలు మరియు ఇంటర్న్‌షిప్ అవకాశాల ప్రాధాన్యాన్ని వివరించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐటీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్స్ డాక్టర్ చొక్కనాథన్, ఎమ్.వాసుదేవన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :