Saturday, 18 April 2026 04:02:37 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్

బెంగళూరులోని ప్రతిష్టాత్మక సిస్కో కంపెనీని సందర్శించిన మిట్స్ విద్యార్థులు

Date : 17 April 2026 10:14 PM Views : 9

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 17 : మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ మూడవ సంవత్సరం డేటా సైన్స్‌కు చెందిన 45 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్‌లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక సిస్కో (Cisco) కంపెనీని సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించడమే ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిస్కో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఇంజినీరింగ్) మల్లి రావు డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI), నెట్‌వర్కింగ్ టెక్నాలజీలు మరియు క్లౌడ్ కంప్యూటింగ్ వంటి తాజా సాంకేతిక అంశాలపై అవగాహనాత్మకమైన మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. సిస్కోలో ప్రస్తుత పరిశోధనలు, ఆధునిక సాంకేతిక అభివృద్ధులు మరియు భవిష్యత్ టెక్నాలజీ ధోరణులపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి రంగాల్లో సిస్కో సంస్థ విస్తృతంగా పనిచేస్తోందని తెలిపారు. విద్యార్థులు నూతన జెనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన పెంచుకుని, భవిష్యత్ కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.కిరణ్ కుమార్,బి విద్యశ్రీ ల బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :