Monday, 14 September 2026 06:33:38 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

నిజాయితీకి మారుపేరు సర్పంచ్ పసుపులేటి చలపతి

ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం సబబు కాదు కురవంక పంచాయతీ అభివృద్ధికి సొంత నిధులు వెచ్చించారు వార్డు మెంబర్లు గొంగడి కృష్ణమూర్తి, నాగరాజ స్పష్టం

Date : 29 November 2025 04:41 PM Views : 542

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 29: నిజాయితీ,మంచితనానికి కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి మారుపేరని,అటువంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేయడం సమంజసం కాదని వార్డు మెంబర్లు గొంగడి కృష్ణమూర్తి,నాగరాజలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ కురవంక ఉప సర్పంచ్ బైగారి భారతి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పసుపులేటి చలపతి విజయం సాధించారని,ఆయనతోపాటు వార్డు మెంబర్లను గెలిపించుకున్నారని గుర్తుచేశారు.అప్పట్లో చలపతిని బాబాయ్ అంటూ భారతి సంబోధించేదని తద్వారా ఆమెను ఉపసర్పంచిగా నియమించి మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు.మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ సమావేశానికి హాజరై పంచాయతీలో జరిగిన అభివృద్ధి,ఖర్చు చేసిన నిధులపై రిజల్యూషన్ సిద్ధం చేస్తే తాను సైతం సంతకం చేస్తాననన్న విషయాన్ని వారు గుర్తుచేశారు.కేవలం ఉప సర్పంచిపై అవిశ్వాసం తీర్మానం పెట్టామనే నెపంతో సర్పంచ్ పసుపులేటి చలపతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని,ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.నిజంగా సర్పంచ్ అవినీతికి పాల్పడి ఉంటే ఐదుగురు మహిళ వార్డు మెంబర్లు ఉన్నారని ఆ విషయాన్ని ఉప సర్పంచ్ వారి దృష్టికైనా తీసుకెళ్లి ఉండాల్సిందన్నారు.నిరంతరం పంచాయతీ అభివృద్ధి,ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే సర్పంచ్ చలపతిపై దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.అనంతరం మరో వార్డు మెంబర్ నాగరాజు మాట్లాడుతూ కురవంక పంచాయతీని అన్నివిధాల అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు పసుపులేటి చలపతి అన్నారు.నిధులు లేకున్నప్పటికీ సొంత నిధులతో పంచాయతీలోని ప్రజల సమస్యలను ఆయన పరిష్కరించారన్నారు.పంచాయతీలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందని,ఎన్నో సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని నిర్మించారని,ఇటీవల కాలంలో 39 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.కురవంక పంచాయతీకి చెందిన పసుపులేటి వినోద్ కుమార్ వాస్తవాలు తెలుసుకోవాలని,మీ తండ్రి స్వర్గీయ పసుపులేటి మోహన్ గురించి,ఆయన అవినీతి గురించి వార్డు ప్రజలకు అంతా తెలుసనన్నారు.వార్డులో మౌలిక సదుపాయాలు,కల్పన తాగునీటి పరిష్కారానికి సర్పంచ్ పసుపులేటి చలపతి విశేష కృషి చేశారని కొనియాడారు.ఆయన సమర్థతను గుర్తించి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు.కేవలం ఆయనపై బురద జల్లడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉపసర్పంచ్ భారతి నిజంగా వారం రోజుల క్రితం రాజీనామా చేసి ఉంటే సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఎందుకు హాజరవుతారని ప్రశ్నించారు.ఇప్పటికైనా సర్పంచ్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని,పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అనిత,శ్రీనివాసులు,చంద్రిక మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :