Monday, 14 September 2026 09:52:09 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పేరుకు పెద్దేరు ప్రాజెక్టు కు పుట్టెడు సమస్యలు

కలెక్టర్ సార్.. మీరేనా 2047 విజన్ తో ఆదుకోండి - పెద్దేరు చైర్మన్ కొటాల శివకుమార్

Date : 11 March 2026 09:27 AM Views : 395

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 10 : తంబళ్లపల్లె మండలం లోని జిల్లాలోనే అతిపెద్ద పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ స్పందించి పరిష్కరించాలని పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. మంగళవారం 2047 విజన్ టీం సభ్యులు పెద్దేరు ప్రాజెక్టు సమస్యలను అధ్యయనం చేశారు. వారికి చైర్మన్ శివకుమార్ పెద్దాయన ప్రాజెక్ట్ లోని సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి వివరించారు.పెద్దేరు ప్రాజెక్టుకు రహదారి మరమ్మతులు, పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం, చేప పిల్లల పెంపకం యూనిట్, ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మాణం, గెస్ట్ హౌస్ లు, ప్రధాన కాలవలు, పిల్ల కాలవలు మరమ్మతులు, ప్రాజెక్ట్ కింద మరమ్మతులు,పార్కుల సుందరీ కరణ, పనులు చేపట్టాలని వారికి విశదీకరించారు.ప్రాజెక్టు ఆయకట్టలో సుమారు 5000 ఎకరాలు సాగుతో పాటు రెండు మండలాల వేలాది మంది రైతులకు వ్యవసాయం తోపాటు కూలీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెండేళ్లుగా ప్రాజెక్ట్ పార్క్ అలనా పాలనా లేక అడవిని తలపిస్తుండగా సౌకర్యాలు లేక పర్యాటకులు రాకపోకలు నిలిచి నిర్మానుషంగా తయారైంది. నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇక్కడ అధికార పార్టీకి ఇన్చార్జి లేక ప్రాజెక్ట్ అభివృద్ధి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కలెక్టర్ గారి స్పందించి వెంటనే 2047 విజన్ కార్యక్రమంలో ప్రాజెక్టు చేపడితే వేలాదిమంది రైతులు, కూలీలకు జీవనోపాధి తో పాటు వేలాది మంది పర్యాటకులను ఆకర్షించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు కావడం ఖాయం. *పదవి తప్ప ₹10 లేవు. ప్రాజెక్టు అభివృద్ధి ఎలా సాధ్యం* చైర్మన్ కొటాల శివకుమార్. పేరుకు జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు. చైర్మన్ అయిన నాటి నుండి ఒక పైసా నిధులు లేవు అభివృద్ధి ఎలా చేయాలి. ప్రాజెక్టు సమస్యలపై రాష్ట్రస్థాయి మంత్రులు, అధికారులకు ఫిర్యాదులు చేశాను. కలెక్టర్ గారైన స్పందించి 2047లో ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :