నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 15 ః ప్రతి విద్యార్థి గ్రంథాలయంలోని పుస్తకాల పఠనం ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని ఎంఈఓ త్యాగరాజు హితవు పలికారు. శనివారం గ్రంధాలయం లో ఆయన పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలోని దేశ స్వాతంత్ర సమరయోధులు, సైన్స్ పరిజ్ఞానం, పురాతన కళలు, సాహిత్యం, నీతి కథలతో భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి సహకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి జిలాని భాష, ఉపాధ్యాయురాలు పద్మావతి, రిటైర్డ్ విఆర్ఓ పద్మనాభరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News