Wednesday, 29 July 2026 05:23:30 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఇంజనీరింగ్ శాఖల పనుల్లో వేగం పెంచాలి - కలెక్టర్ నిశాంత్ కుమార్

మౌలిక వసతుల కల్పించడమే లక్ష్యంతో అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలి

Date : 29 May 2026 07:57 PM Views : 59

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ఇంజనీరింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయా శాఖల పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమగ్రంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్, సంక్షేమ భవనాల నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇంజనీరింగ్ శాఖల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా పూర్తై ప్రజలకు త్వరగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2లో నీవా బ్రాంచ్ కాలువ ఆధునీకరణ పనుల పురోగతిని సమీక్షించారు. కాలువ ఆధునీకరణ, బ్యాలెన్స్ పనులు, నిర్మాణాలు, కాలువ లైనింగ్ తదితర అంశాలపై అధికారులు వివరించారు. భూసేకరణ, సాంకేతిక అనుమతులు, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జలధార – జలహారతి కార్యక్రమం కింద ఫీడర్ ఛానల్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల పరిధిలో గ్రామీణ తాగునీటి సరఫరా, పైప్‌లైన్ నెట్‌వర్క్, సమ్మర్ కంటింజెన్సీ పనుల పురోగతిని సమీక్షించారు. వేసవికాలంలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైనచోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. జల్ జీవన్ మిషన్, అమృత్ 2.0 పథకాల కింద చేపట్టిన వాటర్ సప్లై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు

మదనపల్లి, పుంగనూరు, బి.కొత్తకోట తదితర పట్టణాల్లో అమృత్ 2.0 కింద చేపట్టిన నీటి సరఫరా, పంపింగ్ మెయిన్‌లు, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, పంప్ హౌస్‌లు, పంపిణీ నెట్‌వర్క్ పనుల పురోగతిని అధికారులు వివరించారు. మదనపల్లిలో చిప్పిలి వాటర్ సప్లై స్కీమ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) ప్లాంట్ల పురోగతిని కూడా సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి పట్టణాల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ పరిధిలో సంక్షేమ శాఖలకు చెందిన హాస్టళ్లు, పాఠశాల భవనాలు, గర్ల్స్ హాస్టళ్లు, సైనిక్ స్కూల్, మైనారిటీ వెల్ఫేర్, పాలిటెక్నిక్ హాస్టళ్లు తదితర నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. పూర్తికాని పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. బిల్లుల పెండెన్సీ, స్థల సమస్యలు, కాంట్రాక్టు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ మరియు ట్రాన్స్‌కో పరిధిలో విద్యుత్ సరఫరా, వ్యవసాయ కనెక్షన్లు, సోలార్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల బలోపేతం అంశాలపై సమీక్షించారు. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, రైతులకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని కలెక్టర్ ఆదేశించారు

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. ప్రతి శాఖ పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అవసరమైతే ఉన్నతస్థాయికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వర్షాకాలానికి ముందే రహదారులు, భవనాలు, తాగునీటి, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: