నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 ః కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్ తీసుకుంటే విద్యుత్ బిల్లులు లేకుండా ప్రతి ఇంటికి ఓ ఆదాయ వనరు సమకూరుతుందని (శ్రావణ్ సోలార్ ఎనర్జీ) ప్రతినిధి శ్రీనివాసులు సూచించారు. బుధవారం కురబలకోట ఐకెపి కార్యాలయంలో శ్రావణ్ సోలార్ ఎనర్జీ అధికారి బాలమురుగన్ ఆదేశాల మేరకు మహిళా సంఘ సభ్యులకు సోలార్ విద్యుత్ ఉపయోగాలపై కూలంకషంగా అవగాహన కల్పించారు. సోలార్ రూఫ్ టాప్ తో 50% సబ్సిడీతో పాటు ప్రతినెల బిల్లులు చెల్లించే పని లేకుండా ప్రతి నెల సోలార్ విద్యుత్తు తో ఆదాయం లభిస్తుందన్నారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ, దీర్ఘకాలిక ఆదా, బ్యాంకు రుణ సౌకర్యం, ఇండ్ల తో పాటు మినీ పరిశ్రమలు, మిల్లులు, కళ్యాణ మండపాలు,వ్యవసాయ మోటార్లకు సైతం సోలార్ విద్యుత్ ఉపయోగకరమన్నారు.ఈ అవకాశాన్ని మహిళా సంఘ సభ్యులు, ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఐకెపి మహిళలు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News