నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -జూన్ 05 : మదనపల్లె సమీపం లో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ను జాతీయ నైపుణ్యాభివృధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ), వైస్ ప్రెసిడెంట్ వరుణ్ బాత్రా, న్యూ ఢిల్లీ మరియు ఎథ్నోటెక్ అకాడమీ ఛైర్మన్ డాక్టర్ కిరణ్ రాజన్న, బెంగళూరు సందర్శించారు. మిట్స్ యూనివర్సిటీలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అందుబాటులో ఉన్న వివిధ శిక్షణా కేంద్రాలు, ఆధునిక ప్రయోగశాలలు, ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్లు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన సాంకేతిక సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వరుణ్ బాత్రా మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా విద్యార్థుల కెరీర్‌లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పలు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను మిట్స్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి సహకరిస్తామని తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే అవకాశాలు, స్కిల్ ఆధారిత కోర్సుల అమలు, పరిశ్రమ-విద్యా సంస్థల అనుసంధానం, ఉద్యోగ అవకాశాల పెంపు, ఇంటర్న్‌షిప్‌లు మరియు సర్టిఫికేషన్ కార్యక్రమాలపై విభాగాధిపతులతో చర్చించారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో ఎగ్జిక్యూటివ్ మెంబెర్ టి జి రవి కుమార్, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ లు పాల్గొన్నారు
Reporter
Namitha News