Wednesday, 29 July 2026 06:11:44 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

కోటి రూపాయల అభివృద్ధి పనులతో తంబళ్లపల్లె కు మహర్దశ - డ్వామా పీడీ వెంకటరత్నం

Date : 06 March 2026 10:22 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె -మార్చ్ 06 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం తో పాటు పరసతోపు పంచాయతీ లో కోటి రూపాయలతో అభివృద్ధి పనులతో తంబళ్లపల్లెకు మహర్దశ పట్టనున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం ఆయన తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్ కాలనీ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా రూ 70 లక్షలతో తొలివిడతగా బస్టాండ్ కాలనీ, శ్రీనివాస కాలనీ, ఇట్నే వారి పల్లి కాలనీలలో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు శరవేగంగా జరగడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తంబళ్లపల్లె మండలంలో పూర్తిస్థాయిలో సిసి రోడ్లు నిర్మాణాలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి చేయడానికి చొరవ చూపిస్తున్నట్లు చెప్పారు. సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు నాణ్యత లోపం లేకుండా స్థానిక ప్రజల సమన్వయంతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీలో కోనేరు మరమ్మతు పనులు వేగవంతం చేసి కోనేరు సర్వాంగ సుందరంగా తయారు చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్ డిఇ మునిరాజ్, ఏఈ వెంకటరమణ, అభివృద్ధి పనుల స్పెషలాఫీసర్ రెడ్డప్ప, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టి ఏ బాలగంగాధర్, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, ఐసుల కృష్ణ, 20 47 విజన్ సభ్యులు రమణమ్మ, తిప్పమ్మ, కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :