Tuesday, 15 September 2026 09:54:43 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

అనంతపురము ద్రాక్ష పండ్లకు భౌగోళిక సూచిక జి.ఐ. ట్యాగ్

Date : 03 March 2026 07:48 PM Views : 290

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె - మార్చి 03 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్-టు-బి యూనివర్సిటీ వారు అనంతపురము ద్రాక్ష పండ్లకు భౌగోళిక సూచిక (GI) ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడిందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీ లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన తేలిపారు. అనంతపురము ద్రాక్ష పండ్లకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ముదురు రంగు, అధిక రసం, సమతుల్యమైన తీపి రుచి, తేలికపాటి పులుపు, మెత్తని గుజ్జు మరియు ఎక్కువకాలం నిల్వ ఉండే లక్షణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వ్యవసాయ-వాతావరణ పరిస్థితులతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అనంతపురము ద్రాక్ష సాగుదారులు మరియు ఉత్పత్తిదారుల సంఘం చెన్నైలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ, ఐపిఆర్ కార్యాలయానికి జి ఐ దరఖాస్తును సమర్పించిందని అన్నారు. ఈ దరఖాస్తు ద్వారా అనంతపురము ద్రాక్ష పండ్లను అనంతపురం భౌగోళిక ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన విలక్షణ వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా కోరుతున్నామని పేర్కొన్నారు. జి ఐ రక్షణ ద్వారా ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నిరోధించడం, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించేలా చూడడం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అనంతపురము ద్రాక్ష పండ్ల విలువను పెంచడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్‌కు దోహదపడిన అవని ఫారం ల్యాబ్ టెక్నాలజీస్ (AFLABT) ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, అనంతపూర్, మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ వారి ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్- రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ చెరుకూరి రవీంద్రనాథ్, ఉత్పత్తిదారుల కంపెనీ ప్రతినిధి బి. సర్వేశ్ లు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :