Sunday, 13 September 2026 08:02:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి పెట్టండి - మాజీ ఎమ్మెల్యే జి. శంకర్ యాదవ్

Date : 04 September 2026 09:56 PM Views : 89

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె/పీటీఎం - సెప్టెంబర్ 04 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల లోని ప్రజల సమస్యలపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తంబళ్లపల్లె నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం పీటీఎం లోని విజయ గణపతి కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజావేదిక సమావేశంలో అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా టిడిపి, కూటమి నాయకులు తో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నేటి నుండి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల పరిధిలో ప్రతి సమస్యను ప్రతి శాఖ అధికారి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. అనంతరం ప్రజావేదిక లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, ఉపాధి, పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఆలకించి సంబంధిత అధికారులను వెంటనే పరిష్కరించడానికి సూచనలు చేశారు. ప్రజలు తమ సమస్యలను టిడిపి కూటమి నాయకుల దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కారానికి నాతో పాటు మా నాయకులు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలు సైతం ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను పరిష్కరించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించిన 2047 విజన్ స్థాపనకు సహకరించాలన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జయశంకర్ యాదవ్ ను ఆరు మండలాల నుండి తరలివచ్చిన టిడిపి శ్రేణులు ఘనంగా సన్మానించి జయ జయ ద్వానాలు చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: