Sunday, 13 September 2026 02:48:33 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ప్రజల ఆరోగ్యాని గాలికి వదిలేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలి

Date : 01 April 2026 03:33 PM Views : 283

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 01 : రాష్ట్రంలో పేద ప్రజలకు అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిల కారణంగా రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించడం బాధాకరమని బుధవారం స్థానిక పిఎన్ఆర్ కళ్యాణమండపంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యవర్గ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఏ .రామనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన బకాయిలు 3000 కోట్ల రూపాయలు ఇవ్వలేదని పేదలకు అందించే వైద్య సేవలు నిలిపివేయాలనుకోవడం చాలా దురదృష్టకరమని దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆస్పత్రులలో జీతాలు లేక మందుల కొరత వలన మేము వైద్యం అందించలేమని ఇప్పటికే అనేక వైద్యశాలలో ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని వారన్నారు.పేద ప్రజలకు అందించవలసిన వైద్య సేవలు ఖర్చులు వెంటనే విడుదల చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒకవైపు ప్రజా ఆరోగ్యంపై గొప్ప ప్రకటనలు చేస్తూ, మరోవైపు ఆసుపత్రులకు చెల్లింపులు చేయకపోవడం ద్వంద్వ వైఖరికి ఉదాహరణ. ఈ కారణంగా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే అత్యంత నష్టం పేద, బలహీన వర్గాలకే జరుగుతుందన్నారు ప్రజా సంక్షేమ పథకాలపై ఖర్చు తగ్గించి, కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వానికి తగదు. ఆరోగ్యశ్రీ సేవలు అంతరాయం కలిగితే సీపీఐ ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే నిర్ణయం అన్యాయం – సీపీఐ దళితులు క్రైస్తవ మతం స్వీకరించిన కారణంగా వారికి ఎస్సీ రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు మతం మారినా కుల వివక్ష మారదని, దళిత క్రైస్తవులు ఇప్పటికీ సామాజికంగా అదే వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు ఎస్సీ రిజర్వేషన్లు తొలగిస్తే దళిత క్రైస్తవులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో పూర్తిగా వెనుకబడే ప్రమాదం ఉందని సీపీఐ ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉన్నత విద్యలో ప్రవేశాలు తగ్గిపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు కోల్పోవడం, అలాగే ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం రక్షణ కూడా దూరమవుతుందని పేర్కొంది. సమాజంలో కుల వివక్ష కొనసాగుతున్న పరిస్థితుల్లో మతాన్ని ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ స్పష్టం చేసింది. దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని వారికి ఎస్సీ హక్కులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేసింది. అలాగే ఈ అంశంపై అన్ని ప్రజాస్వామ్య, సామాజిక సంస్థలు ముందుకు వచ్చి దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్,సహయ కార్యదర్శి తోపు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, సాంబశివ, మురళి, సిద్దిగాళ్ళ శ్రీనివాసులు, సుమిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: