Saturday, 12 September 2026 05:35:00 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమన్వయంతో వేగవంతం చేయాలి

ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలి: నిస్సార్ అహమ్మద్

Date : 07 July 2026 04:52 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమన్వయంతో వేగవంతం చేయాలి ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలి: నిస్సార్ అహమ్మద్ : మదనపల్లి రూరల్ మండలంలోని కొత్తఇండ్లు గ్రామ పరిధిలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఎస్. నిస్సార్ అహమ్మద్ మంగళవారం పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో సహకరించారు. డిజిటైజేషన్ ప్రక్రియ పురోగతిపై సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేందుకు గడువు సమీపిస్తున్నందున అధికారులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు), రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా, ఎవరూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజలు కూడా అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా అధికారులు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె. ఇర్ఫాన్, మండల బూత్ కమిటీ అధ్యక్షుడు చిప్పిలి మల్లికార్జునరెడ్డి, ఈశ్వర్ నాయక్, బయ్యారెడ్డి, బీఎల్‌ఏలు ఖాజా, రోషన్, షంషాద్ బేగం, రామాంజి, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :