నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పార్టీ పదవులు అలంకారం కోసం కాదు.. బాధ్యతగా పనిచేయాలి 2029లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం: ఎస్. నిసార్ అహ్మద్ పీలేరు పట్టణంలోని ఎం.ఎన్.ఆర్. గార్డెన్స్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా స్థాయి విస్తృత సమావేశం విజయవంతంగా జరిగింది. పీలేరు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదనపల్లె నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహ్మద్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా కమిటీలలో వివిధ స్థాయిల్లో పార్టీ పదవులు నిర్వహిస్తున్న నాయకులకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కల్పించడంతో పాటు వారికి బాధ్యతలను మరింత స్పష్టంగా తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. పార్టీలో వివిధ స్థాయిల్లో పదవులు పొందిన నాయకులు గుర్తింపు కార్డులను కేవలం అలంకార ప్రాయంగా ధరించకుండా, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని నిసార్ అహ్మద్ సూచించారు. ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత పటిష్టమైన పునాది నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారిని 2029లో తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోడమే ప్రతి వైఎస్సార్‌సీపీ నాయకుడు, కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని ఎస్. నిసార్ అహ్మద్ పిలుపునిచ్చారు. పార్టీ నాయకత్వం ఇచ్చిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు అనూషా రెడ్డి, జింకా చలపతి, డి. ఉదయకుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ మనుజా రెడ్డి, ఎస్ ఈ సి సభ్యురాలు షమీమ్ అస్లాం, జడ్ పి టీ సి సి హెచ్. రామచంద్రా రెడ్డి వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వి.ఎస్. రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, ఎల్. రఘునాథ రెడ్డి, ఎస్ కె ఇర్ఫాన్, ఆవుల మల్లికార్జున ,గార్ల చంద్రమౌళి, కోటూరు ఈశ్వర్, దండాల రవి చంద్రా రెడ్డి, టి ఏ సి సభ్యుడు కరీముల్లా, మండల కన్వీనర్లు కేశవ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పాల్ చంద్రశేఖర్, శ్రీనివాసులు మాజీ సర్పంచ్ వలసపల్లి నాగరాజ రెడ్డి, ముజీబ్, శీలం రమేష్, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కొత్తపల్లి నాగార్జున నాయుడు, ఆవుల విశ్వనాథ్, శారదా రెడ్డి, వినుత బాయి, ముజీబ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News