Tuesday, 15 September 2026 11:47:08 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

పెద్దేరు ప్రాజెక్టు పేరు గొప్ప - సౌకర్యాలు శూన్యం

పట్టించుకోని పర్యాటకశాఖ, వేధిస్తున్న నిధుల కొరత

Date : 12 December 2025 08:00 PM Views : 326

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : అన్నమయ్య జిల్లాలోనే తంబళ్లపల్లెకు సమీపంలోనే పెద్దేరు ప్రాజెక్టు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయకట్టులో సుమారు 5 వేల ఎకరాల సాగు తో తంబళ్లపల్లె, పెద్దమండెం మండలాల్లోని సుమారు పదివేల మంది రైతులు, కూలీలకు జీవగర్ర గా నిలిచింది. ప్రాజెక్టు నిండితే ప్రాజెక్టుతో పాటు పార్కులు సందర్శనకు ప్రతిరోజు వందలాదిమంది పర్యాటకులతో కళకళ లాడుతుంది. అయితే ప్రాజెక్టు కు వెళ్లడానికి తంబళ్లపల్లె-పెద్దమండెం ప్రధాన రహదారి నుండి రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. ప్రాజెక్టు వద్ద గతంలో నిర్మించిన గెస్ట్ హౌస్, పంప్ హౌస్, క్వార్టర్స్ శిధిలావస్థకు చేరుకున్నాయి. పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో నేటి ప్రాజెక్టు, పార్కు, రోడ్డు మరమ్మతులకు పాల కవర్గం నిధులు లేక చేతులెత్తేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద సౌకర్యాల లేమితో సందర్శకులు నిరాశ, నిస్పృహ ప్రదర్శిస్తున్నారు. పెద్దేరు ప్రాజెక్టుతో పాటు పార్కులు సుందరీకరణ, పిల్ల కాలవల మరమ్మతులు, తాగునీరు, రోడ్డు మరమ్మతులు,మౌలిక వసతులు, బోటింగ్ సిస్టం, గెస్ట్ హౌస్ నిర్మాణాలు, రెయిన్ గేజ్ ఏర్పాటు,నిరంతర విద్యుత్తు ఏర్పాటు చేస్తే ప్రతిరోజు పర్యాటకుల సందర్శనతో పాటు ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు ప్రాజెక్టు పరిధిలో చేప పిల్లల పెంపకం ప్రాజెక్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు జీవనోపాధి ఏర్పడుతుంది. పెద్దేరు ప్రాజెక్టు కు పూర్తిస్థాయిలో ఈ సౌకర్యాల కల్పనకు సుమారు రూ 10 కోట్లు నిధులు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు, పర్యాటక శాఖ అధికారులు స్పందించి ఎంతో ఉన్నత ఆశయంతో నిర్మించిన పెద్దేరు ప్రాజెక్ట్ కు పూర్వవైభవం తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు, ఆయకట్టు రైతులు, కూలీలు, రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :