నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 21 : పుంగనూరు లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పేదలు, స్థానిక ప్రజలు, ప్రయాణికులకు భోజనం వడ్డించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, ఆయన పాలనలో అమలైన పథకాలను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడిగా జగన్‌కు ప్రజల్లో విశేష ఆదరణ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, నాగభూషణం, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News