Tuesday, 15 September 2026 09:40:24 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు

Date : 22 December 2025 05:35 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం (22-12-2025) మహానీయ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి రమణ రెడ్డి మాట్లాడుతూ, భారత గణిత శాస్త్రానికి విశ్వవ్యాప్త ఖ్యాతిని తీసుకువచ్చిన మహానీయుడు శ్రీనివాస రామానుజన్ అని తెలిపారు. అంకెల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ఆసక్తి, పరిశోధనాత్మక దృక్పథం నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు రామానుజన్ జీవిత చరిత్ర, గణిత శాస్త్రానికి ఆయన చేసిన విశిష్ట సేవలపై ప్రసంగాలు చేశారు. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించే ఉద్దేశంతో క్విజ్ పోటీలు, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎన్‌.ఎస్‌.ఎస్. యూనిట్ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :