నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *సంబరంగా లైఫ్ కేర్ మెడికల్స్ ఆధ్వర్యంలో శేషాచలపతి నాయుడు జన్మదిన వేడుకలు* మదనపల్లె, జూలై 6: టీడీపీ సీనియర్ నాయకులు శేషాచలపతి నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం మదనపల్లెలోని శ్రీకృష్ణ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న లైఫ్ కేర్ మెడికల్స్ వద్ద లైఫ్ కేర్ మెడికల్స్ ప్రసాద్, రాజశేఖర్, చంద్రశేఖర్ (చంటి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శేషాద్రి నాయుడికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లైఫ్ కేర్ మెడికల్స్ రాజశేఖర్ మాట్లాడుతూ, శేషాచలపతి నాయుడు ప్రజలతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, ఆదరణతో శేషాచలపతి నాయుడు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్, కట్టా లక్ష్మి నారాయణ, గిరి రాయల్, దొర స్వామి నాయుడు, మురళి, మస్తాన్ రెడ్డి, డి. కే.నారాయణ, ఆధార్ పవన్, రామ పురం శీనా, కుమార్, మహాదేవ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని శేషాచలపతి నాయుడికి పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఉత్సాహభరితంగా, ఆప్యాయ వాతావరణంలో ఘనంగా జరిగాయి.
Reporter
Namitha News