Sunday, 13 September 2026 07:40:34 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పెద్ద చెరువు కట్టను కబ్జాల నుండి కాపాడండి - సిపిఐ

Date : 25 April 2026 03:32 PM Views : 261

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - ఏప్రిల్ 25 : బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని పట్టణానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు కట్టను కబ్జాల నుండి కాపాడాలని సిపిఐ తంబళ్లపల్లె నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,బి.కొత్తకోట మండల కార్యదర్శి జి.రఘునాథ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు కట్ట కబ్జా విషయం మీద శనివారం మండల తహసిల్దార్ కార్యాలయం నందు రెవెన్యూ అధికారులకు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ;బి.కొత్తకోట చెరువు కట్టను చెరువు కింద ఉన్నటువంటి భూస్వాములు తమ భూమిని ఎత్తు పెంచుకొని వానిజ్య సముదాయాలు నిర్మించుకునేందుకుగాను, పట్టణంలోని వేస్ట్ మట్టిని ట్రాక్టర్ల ద్వారా కట్టమీద నుండి తమ పొలాల్లోకి తరలించి,జెసిబిల ద్వారా చదును చేయించి చెరువు కట్టను ఆనవాళ్లు లేకుండా కబ్జా చేస్తున్నారని ఆవేదన చెందారు.ఇప్పటికే చదునుచేసిన స్థలంలో వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇచ్చారని అన్నారు.చెరువు తూము నుండి ఆయకట్టు కోసం నీరు పారే కాలువలు కూడా మూసివేసారని మండిపడ్డారు.ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం చెరువులు,కుంటలు నీటితో నింపడానికి కాలువలు,చెరువు కట్టలు మరమ్మత్తులు చేపట్టాలని,అన్ని చెరువులనూ నీటితో నింపడానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కూడా,ప్రతిరోజూ అధికార యంత్రాంగం ప్రయాణించే రహదారిలో ఉన్న పెద్ద చెరువు కట్ట కబ్జాలు కనపడుతున్నా కూడా వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం,కనీస చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని వారన్నారు.సదరు కబ్జాల సాకుతో కట్టకింద ఉన్న మిగిలిన భూ యజమానులు కూడా అదే విధంగా కట్టను కబ్జా చేసే ప్రమాదం పొంచి ఉన్నదని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని సదరు కబ్జాలను తొలగించి చెరువు యొక్క తూములను,కాలువలను కాపాడాలని,లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చెరువుకట్ట మీదనే ఆందోళనలకు శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఏస్.తంబయ్యశెట్టి,చెన్నకేశవులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :