నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : మండలంలోని పాడి రైతులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ పశుగ్రాస విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి సూచించారు. శుక్రవారం ఆర్ఎన్ తాండ పంచాయతీ బోనాసువారిపల్లి లో పాడి రైతులకు సబ్సిడీ పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశారు. మండలానికి 15 టన్నుల పశుగ్రాస విత్తనాలు వచ్చాయని పాడి రైతులు తమ పరిధిలోని పశువైద్యశాలల ద్వారా గడ్డి విత్తనాలు పొందాలన్నారు. త్వరలో మండలంలోని పాడియావులకు సబ్సిడీ దాణా సర్వరా జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ సిద్దిమల్రెడ్డి, పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News