నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 02 : తంబళ్లపల్లె మండలంలో విబిజి రాంజీ పథకంలో చేస్తున్న ఉపాధి హామీ పనులు ఆదర్శవంతంగా జరుగుతున్నట్లు ఏపీడి చందన కొనియాడారు. బుధవారం ఎంపీడీవో ఉషారాణి ఆధ్వర్యంలో జరిగిన విబిజి రాంజీ పథకంపై సిబ్బందితో అవగాహన సదస్సు జరిగింది. ఏపిడి చందన మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో విబిజి రాంజీ పథకంలో నీటి సంరక్షణ పనులు, ఫారం పాండ్స్ ,ముమ్మరం జరుగుతున్నాయని ఇదేవిధంగా మొక్కల పెంపకం పై రైతులకు అవగాహన కల్పించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు ఆడుకుంటాయని క్షేత్ర సహాయకులు పాడి రైతులకు గడ్డి పెంపకం పై సూచనలు ఇచ్చి గడ్డి పెంపకానికి సహకరించాలని సలహా ఇచ్చారు. వి బి జి రాంజీ పనులలో ఏపీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్ర సహాయకులకు పనులలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పనులు ఊపందుకున్నాయి. బిల్లుల చెల్లింపులు సైతం పూర్తి సహకారం అందిస్తున్నట్లు కూలీలు చెప్పుకుంటున్నారు. ఈ సమీక్షలో ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు బాలగంగాధర్, సుజాత, భూదేవి, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు
Reporter
Namitha News