Sunday, 13 September 2026 06:10:02 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

డీఆర్‌డీఓలో శిక్షణకు విశ్వం ఇంజినీరింగ్ విద్యార్థుల ఎంపిక

Date : 07 February 2026 05:31 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డీఆర్‌డీఓలో శిక్షణకు విశ్వం ఇంజినీరింగ్ విద్యార్థుల ఎంపిక ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, బెంగళూరులో స్టూడెంట్ ట్రైనింగ్‌కు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నందున విశ్వం ఇంజనీరింగ్ కళాశాలకు గర్వకారణం. మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాల (ఆటోనమస్) లోని రిసెర్చ్ & డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన డీఆర్‌డీఓ – ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), బెంగళూరు లో స్టూడెంట్ ట్రైనింగ్ కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం శ్రీ ఎం ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ టిఎస్ గౌస్ బాషా, విభాగాధిపతులు డాక్టర్ బి సురేష్ బాబు మరియు డాక్టర్ వసంత సెలవ కుమార్ మరియు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులు బాలు CSE, వెంపల్లి సబీహా CSE, సోమగుట్ట హిమబిందు ECE. భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన డీఆర్‌డీఓలో శిక్షణకు ఎంపిక కావడం వారి అకాడమిక్ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యం, పరిశోధనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని కళాశాల రిసెర్చ్ & డెవలప్‌మెంట్ సెల్ డాక్టర్ అంజన్ కుమార్ పేర్కొన్నారు. ఈ విజయం కళాశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని మరింత పెంచుతుందని, భవిష్యత్తులో ఉన్నత అవకాశాలకు దోహదపడుతుందని కళాశాల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :