Sunday, 13 September 2026 03:46:10 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

బాలికలపై అత్యాచారాలు దుర్మార్గం -- తీవ్రంగా ఖండించిన ఐద్వా -- శివాజినగర్ లో ధర్నా

Date : 14 July 2026 05:39 PM Views : 92

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బాలికలపై అత్యాచారాలు దుర్మార్గం -- తీవ్రంగా ఖండించిన ఐద్వా -- శివాజినగర్ లో ధర్నా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బాలికలపై అత్యాచారాలు దుర్మార్గమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలు, చిన్నారుపైన జరిగిన లైంగిక దాడులను నిరసిస్తూ మంగళవారం మదనపల్లె పట్టణంలోని శివాజినగర్, విజయ్ నగర్ కాలనీల్లో ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ రోజురోజుకు పిల్లలపై, బాలికలపై, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమవుతున్నాయని ధ్వజమెత్తారు.‌ నేరాలు జరిగిన తర్వాత పాలకులు, అధికారులు ప్రకటనలకే పరిమితమౌతున్నారు తప్ప శిక్షలు అమలు కావడం లేదన్నారు. తీవ్ర జాప్యం కారణంగా రాజకీయ అధికారిక అండదండలతో వెనకేసుకు రావడం నేరస్తులు దర్జాగా సమాజంలో తిరిగి అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. నేరం చేసిన వ్యక్తి ఎంతటి హోదాలో ఉన్నా చట్టం ముందు అందరినీ సమానంగా భావింవి, సమగ్ర విచారణ జరిపి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం, డ్రగ్స్, గంజాయి వలన కుటుంబంలో సమస్యలు, మహిళలు, బాలికలు, చిన్నారులపై హత్యలు అత్యాచారాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు స్పందించి బాధిత కుటుంబాలకు అన్ని విధాల రక్షణ కల్పించి, న్యాయం జరగాలే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో మహిళా భద్రత పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, వివిధ శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణలు ఏర్పాటు చేయాలన్నారు‌. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు షాహిన, జిల్లా కోశాధికారి రెడ్డి ప్రసన్న, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :