నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 : తంబళ్లపల్లె నియోజకవర్గానికి సాగునీటిలో ఆయువుపట్టుగా నిలిచిన పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ వెంకట్రామయ్య ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కు హామీ ఇచ్చారు. సోమవారం మదనపల్లి ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ప్రాజెక్టు చైర్మన్ శివకుమార్ ఎస్ ఈ ని ఘనంగా సన్మానించి స్వాగతించారు. పెద్దేరు ప్రాజెక్టు కు సాధారణ నిధులలో ఒక్క రూపాయి విడుదల కాలేదని ప్రాజెక్టులో కాలువల మరమ్మత్తులు పనులు, ప్రధాన రోడ్డు, పార్కు మరమ్మతులు, గెస్ట్ హౌస్ లు దీనస్థితి, పిల్ల కాలవలు మరమ్మతులు, పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని 4,500 ఎకరాల సాగుభూమి నిర్వీర్యం అయిపోతుందని నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎస్ ఈ వెంకట్రామయ్య పెద్దేరు సమస్యలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ సురేష్ బాబు, ఏఈలు రాయల్ బాబు, సతీష్, పెద్దేరు ఆయ కట్టు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు
Reporter
Namitha News