Monday, 14 September 2026 09:01:28 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Date : 29 March 2026 10:28 PM Views : 307

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి లో ఘనంగా 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తెలుగుజాతి ఆత్మగౌరవానికి నాంది… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం! తెలుగు ప్రజల ఆశయాలకు దిశానిర్దేశం… తెలుగుదేశం పార్టీ పయనం! తెలుగువారి గుండెల్లో గర్వాన్ని నింపిన మహానాయకుడు, ప్రజాసేవను రాజకీయం చేసిన మహోన్నత వ్యక్తిత్వం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు “సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే మహత్తర నినాదంతో 29 మార్చి 1982 నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి… తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని తిరిగి అందించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం అభివృద్ధి పథం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల మహోన్నత ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా నిమ్మనపల్లిలో ఘనంగా టిడిపి నాయకులు కార్యకర్తలు కలసి 44 వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రాజన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంతం మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి మీడియాతో మాట్లాడుతూ… “తెలుగువాడి పౌరుషంలా రెపరెపలాడుతున్న పసుపు జెండా మన గర్వానికి ప్రతీక. ఈ జెండాను మోస్తున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి నా సెల్యూట్! చారిత్రాత్మకమైన ఈ రోజున… ప్రజాసేవకు మళ్లీ పునరంకితం అవుతామని ప్రమాణం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్ర అంటే… అది కేవలం రాజకీయ చరిత్ర కాదు… తెలుగుజాతి గౌరవ చరిత్ర… అభివృద్ధి చరిత్ర… ప్రజాస్వామ్య పరిరక్షణ చరిత్ర! అని తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం – అభివృద్ధికి బ్లూప్రింట్ ప్రజల హృదయాల్లో స్థిరమైన నమ్మకం కలిగించిన దూరదృష్టి గల నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని కేవలం రాజకీయ పార్టీగా కాకుండా… ఒక విజన్‌గా, ఒక వ్యవస్థగా, ఒక అభివృద్ధి ఉద్యమంగా మార్చారని చంద్రబాబు అంటే… ప్రణాళిక చంద్రబాబు ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పాలన పెట్టుబడులకు ఆహ్వానం ఐటీ విప్లవం, ప్రపంచ స్థాయి అభివృద్ధి అంతేకాకుండా… ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు మరింత ధైర్యం ఇచ్చే నాయకుడు, యువతలో ఆశాజ్యోతి నింపుతున్న నాయకుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి శ్రీ నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తును శాసించే శక్తిగా ఎదుగుతున్నారని కొనియాడారు. పరిపాలనలో ఆధునిక ఆలోచనలు లోకేష్ కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అడుగులు ఈ రెండు కలిస్తే రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం ఖాయం అని స్పష్టంగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి మూలస్తంభాలు కార్యకర్తలే కార్యకర్తలు లేకుండా పార్టీ లేదు… కార్యకర్తల శ్రమే తెలుగుదేశం పార్టీకి ప్రాణం అని అన్నారు. నందమూరి తారక రామా చిత్రపటానికి ఘన నివాళి అర్పించడం జరిగింది అనంతరం 20 కేజీల కేక్ కట్ చేసి వారికి పంచి పెట్టడం జరిగింది కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు రెడ్డప్ప రెడ్డి వసంత మునిరత్న మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి సింగల్ విండో అధ్యక్షులు కోట రమణ డైరెక్టర్ చినబాబు మాజీ కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర బీసీ సెల్ అధికార ప్రతినిధి బి లక్ష్మన్న మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మాజీ నిమ్మనపల్లి సర్పంచ్ మల్లప్ప పాపం సర్పంచులు రమణ మహమ్మద్ రఫీ నరేంద్ర జనసేన పార్టీ నాయకులు ఈటికట్టు చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :