నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - అక్టోబర్ 24 : మెడికల్ కాలేజీల నిర్వహణలో పిపిపి విధానాన్ని కూటమి ప్రభుత్వంలోని బిజెపి, జనసేన పార్టీ నాయకులే వ్యతిరేకత వ్వక్తం చేస్తున్నారని, సంతకాల సేకరణ ఉద్యమంలో తమతోపాటు సంతకాలు చేసి మద్దతు ఇస్తున్నారని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మదనపల్లె అవెన్యూ రోడ్డులోని వైసిపి కార్యాలయంలో ఈనెల 28 న నిర్వహించే ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిస్సార్ అహమ్మద్ ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె వైసిపి పరిశీలకులు అనూష రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె మెడికల్ కాలేజ్ నిర్మాణంలో పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 28 న సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం, నిర్వహణ పిపిపి విధానం ద్వారా పేదలకు వైద్యం దూరం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Reporter
Namitha News