నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి జూన్ 2 :ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్ లైన్ మోసం, ప్రేమపేరుతో మోసం,ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకుని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపించాలని, ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు.రాయచోటి టౌన్ నుండి వికలాంగురాలు కాత్యాయని తన సమస్య చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆమె వద్దకే వెళ్లి సమస్య విన్నారు. ఆమె ఇచ్చిన పిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ చట్ట పరిధిలో ఆమె సమస్యను పరిష్కరించాలని రాయచోటి అర్బన్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సదరు ఫిర్యాదులను "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు.
Reporter
Namitha News