నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె అక్టోబర్ 10 : మారుమూల గ్రామాలలో బాల్యవివాహాలు నిషేధించడానికి ఓ రక్షణ కవచం అవసరమని డి సి పి యు కౌన్సిలర్ షకీలా తెలిపారు. గురువారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమం మరియు జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో తంబళ్లపల్లె,పెద్దమండెం మండలాల మహిళా సంరక్షణ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్వైజర్ల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధం కోసం పంచాయతీ, వార్డుల వారీగా కమిటీలు వేయడం జరిగిందన్నారు. పంచాయతీ పరిధిలో పంచాయతీ సర్పంచ్ కమిటీ చైర్మన్గా కన్వీనర్ గా మహిళ సంరక్షణ కార్యదర్శి కన్వీనర్ గా వార్డు స్థాయిలో మహిళా వార్డు మెంబర్ లేదా కౌన్సిలర్ చైర్ పర్సన్ గా వార్డు మహిళ సంరక్షణ కార్యదర్శి కన్వీనర్ గా వ్యవహరిస్తారు అన్నారు. భవిష్యత్తులో గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు బాల్య వివాహాల నిషేధించుటకు ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుచుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు కుసుమ, రాధమ్మ, మహిళా సంరక్షణ కార్యదర్శులు రమణమ్మ, అమ్మాజీ భాను, రాధా, శిరీష, త్రివేణి భారతి, రేవతి, శివకుమారి, రాశి, పుష్పలత, ఉష తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలపై సూచనలిస్తున్న కౌన్సిలర్ షకీలా.
Admin
Namitha News