నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - అక్టోబర్ 14 : డ్వాక్రా సంఘాలకు కనీస సమాచారం ఇవ్వకుండా సంఘమిత్రను నియమించిన సి సి, ఎ పి యం లు. *నియంతల వ్యవహరిస్తున్న నూతనంగా ఎన్నుకున్న సంఘమిత్ర...* డ్వాక్రా సంఘ సభ్యుల అంగీకారం లేకుండా నూతన సంఘమిత్ర నియామకం జరిగిందంటూ ఆవేదన... కనీసం డ్వాక్రా మహిళా సంఘాలలో సభ్యత్వం లేని వ్యక్తి ని సంఘమిత్రగా నియమించడం వెనక ఆంతర్యమేంటంటున్న డ్వాక్రా సంఘాలు. సమర్థవంతమైన సంఘమిత్రను ఎన్నుకునే హక్కును తమకు కల్పించాలంటూ 27 సంఘాలతో కలిసి జిల్లా కలెక్టర్ ని ఆశ్రయించిన డ్వాక్రా మహిళలు.. డ్వాక్రా మహిళల సమస్యలు తెలిసిన సమర్థవంతమైన సంఘమిత్రను ఎన్నుకునే హక్కు తమకు కల్పించాలంటూ తంబళ్లపల్లి మండలం, కన్నె మడుగు గ్రామపంచాయతీకి చెందిన డ్వాక్రా మహిళలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ని ఆశ్రయించారు. గతంలో పని చేసినటువంటి సంఘమిత్ర అనారోగ్య కారణంగా ఇటీవల కాలంలో మరణించడంతో నిబంధనలకు విరుద్ధంగా సి సి, ఎ పి యం లు కలసి అర్హత లేని వ్యక్తిని నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన లీడర్లు అందరూ కలిసి డ్వాక్రా సంఘంలోని వ్యక్తిని సంఘమిత్రగా ఎన్నుకునే వారని అందుకు విరుద్ధంగా డ్వాక్రా సంఘాలకు, డ్వాక్రా మహిళలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కనీసం డ్వాక్రా గ్రూప్ లో కూడా లేని మహిళను సంఘమిత్ర గా నియమించడం వెనక ఆంతర్యమేంటో తెలియడం లేదన్నారు. నూతనంగా ఎన్నుకున్న సంఘమిత్ర నియంతల వ్యవహరిస్తుందన్న కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తద్వారా డ్వాక్రా సంఘాలు నెలవారి ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడం లేదని దీని కారణంగా డ్వాక్రా సంగాలతో పాటు ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. మహిళలు నిర్వహిస్తున్నటువంటి డ్వాక్రా సంఘాలలో సంబంధంలేని పురుషులు ప్రవేశించి తమపై యజమాయిషి చేస్తున్నారని తెలిపారు. ఇదే విషయమై గత నెలలో గ్రీవెన్సెల్ లో తమ సమస్యను తెలియజేసిన ఎటువంటి ప్రయోజనం కనిపించలేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వారు తమ సమస్యకు పరిష్కారం చూపి ప్రభుత్వ అధికారుల సమక్షంలో సంఘమిత్రను ఎన్నుకొనే హక్కును తమకు కల్పించాలంటూ కన్నెమడుగు గ్రామ పంచాయతీకి చెందిన 27 సంఘాల డ్వాక్రా మహిళలతో కలసి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
Reporter
Namitha News