నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - అక్టోబర్ 03 : కురబల కోట మండలం నందిరెడ్డిగారి పల్లె లో ఎంపీడీఓ ఆధ్వర్యంలో సచివాలయం లో జి.యస్.టి. తగ్గింపు పై గ్రామస్థులకు అవగాహనా కల్పించిన అధికారులు. ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం 12 శాతం నుంచి 5 శాతానికి జి.యస్.టి. తగ్గించడం వలన ఎంతో మేలు జరుగుతుందన్నారు , తగ్గిన జి.యస్.టి వల్ల వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్, ట్రాక్టర్ టైర్లు,డ్రిప్ పరికరాలు, కిసాన్ డ్రోన్, పాలక్యాన్స్ వంటి వాటి మీద 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఎంపిడిఓ., డి.యల్.డి.ఓ అమరనాథ్ రెడ్డి, హ్యాండ్లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్, పన్నుల శాఖ అధికారిణి సునీత, పంచాయతీ సెక్రటరీ ,రైతులు పాల్గొన్నారు.
Admin
Namitha News