నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 10 : అంగళ్ళు సమీపం లోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లె లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం ను ఏర్పాటు చేసినారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యన్ రాజ్‌పుత్, సి.ఈ.ఓ (CEO) అట్టివో టెక్నాలజీ సొల్యూషన్స్, హైదరాబాద్ పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న కొద్దీ సైబర్ మోసాలూ అంతకంతకూ పెరుగుతున్నాయి అని అన్నారు. అమాయకుల్ని టార్గెట్ చేసుకొని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా ఖాతాల్లో డబ్బును ఊహకందని రీతిలో లూటీ చేసేస్తున్నారు అన్నారు. సైబర్ మాయాజాలంతో సామాన్యులనే కాదు ప్రముఖుల్ని సైతం బురిడీ కొట్టిస్తున్న అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి అన్నారు. ఈ నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచి మోసాల బారిన పడకుండా, విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని అన్నారు. జియో పొలిటికల్ టెన్సన్స్ వళ్ళ సైబర్ వార్ఫేర్ కు దారి దీసిందని, డేటా సెక్యూరిటీ ఎంతో ముఖ్యమని, డేటా కు భద్రత ఎంతో ముఖ్యమని మనారు. ప్రస్తుతం వీటి పై పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు మరియు అధ్యాపకులు పరిశోధనలు చేయాలనీ ఆయన అన్నారు. వీటి పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని వీటి పై ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుగా ఉన్నాయని ఆయన అన్నారు. కార్యకమం లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ గంగా దేవి, కో ఆర్డినేటర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శివకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరంజిని, స్టూడెంట్ కో ఆర్డినేటర్ రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News