నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 17 ః విద్యార్థులు ఈ దశ నుండే భవిష్యత్తులో విద్యుత్ ఆదా కోసం అవగాహన చేసుకుని తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వాలని ఎంఈఓ త్యాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా మోడల్ స్కూల్, హైస్కూలలో విద్యుత్ శాఖ ఏఈ శేషు కుమార్ ఆదేశాల మేరకు లైన్ఇస్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బొగ్గు, నీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఖర్చు పెరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళిక లో భాగంగా ప్రభుత్వం సౌర విద్యుత్తు, విండ్ పవర్ లపై దృష్టి సారించినట్లు చెప్పారు. విద్యుత్ ఆదా కోసం ఇండ్లలో ఎల్ఈడి బల్బులు వాడాలని సాధ్యమైనంతవరకు విద్యుత్ ఆదాచేసి సోలార్ విద్యుత్తు పై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులు భవిష్యత్తు అంధకారం కాకుండా విద్యుత్ ఆదా చేసి సోలార్, విండ్ పవర్ పై కుటుంబ సభ్యులకు అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, హెడ్మాస్టర్ శ్రీనివాసులు, లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు,లైన్మెన్ శంకర సిబ్బంది నగేంద్ర, ప్రసాద్, అమీన్, వేణు, శేషు, భాస్కర్, రమేష్, కాలేశా, నాగేంద్ర, గోపిదిన్నె నాగేంద్ర, ఇంతియాజ్, శ్రీకాంత్, ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News