నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 4 : అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల ఏడవ తేదీ సోమవారానికి మండలంలో అర్హులైన పక్కాగృహాల లబ్ధిదారుల వివరాలను సర్వే ద్వారా వివరాలు సేకరించి నివేదించాలని తాసిల్దార్ హరికుమార్, ఎంపీడీవో ఉపేందర్ రెడ్డిలు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలను ఆదేశించారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో ఇంటింటి సర్వే నిర్వహించి పక్కా గృహాలు లేని వారు, ఇంటి స్థలాలు లేని వారిని గుర్తించి వారు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ ఇంటింటా సర్వే పారదర్శకంగా నిర్వహించాలని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పక్కా గృహం అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరించాలన్నారు. హౌసింగ్ ఏఈ సుజాత మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే 545 మంది పక్కా గృహాలకు దరఖాస్తులు చేసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తు తన అనంతరం పొజిషన్ సర్టిఫికెట్లు అందించడానికి సచివాలయ సిబ్బంది, వీఆర్వోలు తమ పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ సదస్సులో మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.
Reporter
Namitha News