నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సోమల - మే27 : సోమల మండలం వల్లిగట్ల పంచాయతీ అగ్రహారం లో అమానుష ఘటన. గ్రామంలోని మహిళలకు తన పురుషాంగం చూపాడనే నెపంతో గ్రామంలోని కొందరు ఆనంద్ 35 సం ను గుడ్డలు ఊడదీసి, తరిమి తరిమి తరిమి కొట్టినట్లు సమాచారం మూడు నెలలు క్రితం బాధితుడైన ఆనంద్ అన్న చలపతి 40 విద్యుత్ షాక్ తో మృతి చెందడం తో గ్రామం లోని పెద్దమనుషులు కలిసి చలపతి కుటుంబ సభ్యులకు కొంత నగదు చెల్లించే విధముగా తీర్మానం చేసి కొంత నగదు ఇచ్చారని,మిగతా నగదు ఇవ్వలేదని గ్రామ పెద్దలతో వాగ్వాదం చేశాడని ఒక ఆరోపణ. మహిళలకు తన పురుషాంగం చూపాడనే నెపంతో మహిళలకు చెందిన మగవాళ్ళు ఆనంద్ ను కొందరు చితకబాదారు, వేసుకున్న బట్టలు ఊడడదీసి కొట్టడం తో పారిపోయే క్రమంలో ఆనంద్ వీధుల్లో పరుగెడుతున్న ఎవరు కూడా అడ్డురాలేదని వాపోయాడు క్షతగాత్రుడైన ఆనంద్ ను 108 వాహనం లో కలికిరి ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రాధమిక చికిత్స అందించి పీలేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందించి ఛాతీ ఎముకలు విరిగిన నేపథ్యంలో స్కానింగ్ అవసరం కనుక తిరుపతి రుయా కు తరలించాలని రెఫెర్ చేయగా తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్ . ఘటనపై బాధితుని బంధువులు సోమల పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేసి కేసు నమోదు చేస్తామని వెల్లడించారని తెలిపిన బాధితుని బంధువులు
Admin
Namitha News