నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 24 : తంబళ్లపల్లె మండలం లో సొంత భూమి కలిగిన రైతులు రైతు విశిష్ట సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పక చేయించుకోవాలని మండలంలోని ఏఈఓ లు రైతులకు అవగాహన కల్పించారు. ఏవో రమణ కుమార్ ఆదేశాల మేరకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ (డిజిటలైజేషన్) చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందించనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలు, రాయితీలు పొందాలంటే సొంత భూమి రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలన్నారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పెట్టుబడి, ఎరువులు రాయితీలు, పంటల బీమా, పంటలకు కనీసం మద్దతు ధర, పంటల రుణాలకు సులువుగా ఉంటుందన్నారు. ప్రతి రైతు పట్టాదారు పాసుబుక్కు లేదా వన్ బి, ఆధార్ జిరాక్సిలు, ఆధార్ లింకు కలిగిన ఫోన్ తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఏఈవోలు సురేష్, అంబేద్కర్, సచివాలయాల పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News