Thursday, 16 April 2026 06:49:14 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కోసువారి పల్లె లో టిడిపి అభ్యర్థి జయచంద్రా రెడ్డి ప్రచారం

Date : 24 March 2024 07:23 PM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి మార్చి 24 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లె పంచాయతీలో ఆదివారం టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. పంచాయతీలోని కోసువారిపల్లి కస్పా, రెడ్డివారిపల్లి, నల్ల తిమ్మి రెడ్డి గారి పల్లి, పెద్ద తిమ్మి రెడ్డి గారి పల్లి, చిన్న రెడ్డివారిపల్లి లలో ఇంటింటా ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో లోని సూపర్ సిక్స్ పథకాలతో కూడిన కరపత్రాలను ఇంటింటా పంపి ణితో పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్లలో వైకాపా పాలన లో అభివృద్ధి జరగకపోగా దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ కేసులు, భూ దోపిడి, మైనింగ్, ఇసుక మాఫియా, పేదల భూముల ఆక్రమణ తప్ప ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై నిస్వార్థ సేవ చేస్తున్న దాసరిపల్లి జై చంద్ర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే తంబళ్లపల్లె అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి గ్రామంలో టిడిపి నాయకులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రచారంలో మహిళా నాయకురాలు సిద్ధమ్మ, బిఎంఆర్ ( రెడ్డప్ప) కృష్ణమూర్తి, శివరాం, సోమశేఖర్, రవి, కృష్ణారెడ్డి, ఆనంద్, వెంకటరమణ, మదన, కృష్ణారెడ్డి, జనసేన నాయకులు ముత్త భరత్, వెంకటరమణారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, రెడ్డప్ప రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :