నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : తంబళ్లపల్లె - ఆగస్టు 25 ః తంబళ్లపల్లె మండలం లోని ఆరుగురు విద్యార్థులు అన్నమయ్య జిల్లా జూనియర్ షూటింగ్ బాల్ జట్టుకు ఎంపికయ్యారు. ఆదివారం మదనపల్లెలోని గ్రీన్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ, కార్యదర్శి గౌతమీ ఆధ్వర్యంలో జూనియర్స్ షూటింగ్ బాల్ అన్నమయ్య జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ ఎంపికల్లో జిల్లా నుండి పలు పాఠశాలల నుండి వందల మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. మండలంలోని కన్నెమడుగు ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థినిలు రిషిత, ప్రియా వల్లిక తో పాటు స్టాండ్ బై గా స్వాతి ఎంపికయ్యారని పీడి ఖాదర్బాషా తెలిపారు. అదేవిధంగా కమ్మలపల్లి మోడల్ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న గౌస్ మహమ్మద్, టెన్త్ విద్యార్థిని కరి మున్నిసా, 9వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ ఎంపికైనట్లు పీడి లత చెప్పారు. జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థులను ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, హెచ్ఎం మదన్మోహన్, ఎస్ఎంసి చైర్మన్లు, అధ్యాపకులు, ప్రజలు ప్రశంసించారు.
Admin
Namitha News