నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 15 : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్వసభ్య సమావేశాలు జరగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆరు మండలాలలో వైకాపా దౌర్జన్యంగా గత స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలను దౌర్జన్యంగా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని అధికార టిడిపి నాయకులు మండల మీట్ లను అడ్డుకుంటూ వస్తున్నారు. తంబళ్లపల్లె మండలంలో అభివృద్ధి కుంటుపడి వచ్చిన నిధులు వృధా కాకూడదని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఇరువర్గాలతో చర్చించి మండల మీట్ సవ్యంగా జరగడానికి తన చాణక్యం ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. శనివారం వైకాపాకు చెందిన 11 మంది ఎంపీటీసీలు, టిడిపి, జనసేనకు చెందిన ఏడు మంది కమిటీ సభ్యులతో ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి అంతా తానై మండల సర్వసభ్య సమావేశం సాఫీగా జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనసూయ, ఉపాధ్యక్షులు శ్యామలమ్మ, కరీం టిడిపి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, తులసీధర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, బి ఎమ్ ఆర్, జనసేన పార్టీ నుండి ఎద్దుల నరసింహులు మండలంలోని గ్రామాలలో తాగునీటి సమస్యలు, కొటాల, ప్రాజెక్టు, చౌడ సముద్రం ఏరు పై బ్రిడ్జిలు, కోసువారిపల్లి రహదారి, ఆర్ ఎన్ తాండ పంచాయతీలో రహదారి, పలు ప్రాంతాలలో కచ్చా రోడ్లు నిర్మాణాలు తోబాటు విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి తేగా ఎంపీడీవో సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. మండల మీట్ సవ్యంగా జరగడానికి సహకరించిన వైకాపా ప్రజా ప్రతినిధులు, అధికార కమిటీ సభ్యులు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మండల సర్వసభ్య సమావేశంలో కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఏవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈలు సుజాత, నవీన్ కుమార్, లక్ష్మీనారాయణ, తమ శాఖల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పనులపై నివేదికలు సభకు వివరించారు. మండల్ మీట్లో మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల మీట్ కు పలు కీలక శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. ఎస్సై లోకేష్ రెడ్డి ముందస్తుగా ప్రోటోకాల్ పాటించి మండలమీట్ సవ్యంగా సాగడానికి భారీ బందోబస్తు నిర్వహించారు.
తంబళ్లపల్లె ఫిబ్రవరి 15 : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్వసభ్య సమావేశాలు జరగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆరు మండలాలలో వైకాపా దౌర్జన్యంగా గత స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలను దౌర్జన్యంగా బెదిరించి ఏకగ్రీవం చేసుకున్నారని అధికార టిడిపి నాయకులు మండల మీట్ లను అడ్డుకుంటూ వస్తున్నారు. తంబళ్లపల్లె మండలంలో అభివృద్ధి కుంటుపడి వచ్చిన నిధులు వృధా కాకూడదని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి ఇరువర్గాలతో చర్చించి మండల మీట్ సవ్యంగా జరగడానికి తన చాణక్యం ప్రదర్శించడంలో సఫలమయ్యాడు. శనివారం వైకాపాకు చెందిన 11 మంది ఎంపీటీసీలు, టిడిపి, జనసేనకు చెందిన ఏడు మంది కమిటీ సభ్యులతో ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి అంతా తానై మండల సర్వసభ్య సమావేశం సాఫీగా జరిపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనసూయ, ఉపాధ్యక్షులు శ్యామలమ్మ, కరీం టిడిపి కమిటీ సభ్యులు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, తులసీధర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, బి ఎమ్ ఆర్, జనసేన పార్టీ నుండి ఎద్దుల నరసింహులు మండలంలోని గ్రామాలలో తాగునీటి సమస్యలు, కొటాల, ప్రాజెక్టు, చౌడ సముద్రం ఏరు పై బ్రిడ్జిలు, కోసువారిపల్లి రహదారి, ఆర్ ఎన్ తాండ పంచాయతీలో రహదారి, పలు ప్రాంతాలలో కచ్చా రోడ్లు నిర్మాణాలు తోబాటు విద్యుత్ సమస్యలపై అధికారుల దృష్టికి తేగా ఎంపీడీవో సానుకూలంగా స్పందించి ప్రతి సమస్యను పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తామని చెప్పారు. మండల మీట్ సవ్యంగా జరగడానికి సహకరించిన వైకాపా ప్రజా ప్రతినిధులు, అధికార కమిటీ సభ్యులు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మండల సర్వసభ్య సమావేశంలో కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఏవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈలు సుజాత, నవీన్ కుమార్, లక్ష్మీనారాయణ, తమ శాఖల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పనులపై నివేదికలు సభకు వివరించారు. మండల్ మీట్లో మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల మీట్ కు పలు కీలక శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. ఎస్సై లోకేష్ రెడ్డి ముందస్తుగా ప్రోటోకాల్ పాటించి మండలమీట్ సవ్యంగా సాగడానికి భారీ బందోబస్తు నిర్వహించారు.
Reporter
Namitha News