Thursday, 16 April 2026 04:58:33 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ జగన్ రెడ్డి దే

* ఐదేళ్లలో 85 శాతం హామీలను ఎగనామం పెట్టిన జగన్ సర్కార్ * కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్ళించడానికి ధర్నాల డ్రామా - రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద

Date : 03 June 2025 10:13 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి జూన్ 3 : వెన్నుపోటు గొడ్డలి వేటు పేటెంట్ జగన్ రెడ్డి దేనని, గత ఐదేళ్లలో జగన్ సర్కార్ 85 శాతం హామీలను ఎగనామం పెట్టిందని, కుంభకోణాల నుంచి ప్రజాదృష్టి మళ్ళించడానికి జగన్ ముఠా ధర్నాల డ్రామా ఆడుతున్నారని, రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70 శాతం హామీలు అమలు చేసిందని పేర్కొన్నారు. మంగళవారం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన జింక వెంకట నరసయ్య తన బెరైటీస్ మైల్లో జగన్ తాత రాజారెడ్డికి కొంత భాగస్వామ్యం కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైండ్ ఓనర్ ని హత్య చేసి ఆ మైన్ ను రాజారెడ్డి కబ్జా చేశాడని, బీసీలకు వెన్నుపోటుతోనే జగన్ కుటుంబం బెరైటీస్ యజమాని అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసిపి పార్టీని స్థాపించాడని, శివకుమార్ స్థాపించిన వైకాపా పార్టీని కబ్జా చేసి శివకుమార్ కు వెన్నుపోటు పొడిచాడని, ఎత్తుకొని పెంచిన బాబాయిని గొడ్డలివేటుతో నరికి చంపిన కిరాతకుణ్ణి కాపాడుతూ రక్త సంబంధానికి వెన్నుపోటు పొడిచాడని, ఆస్తి కోసం తల్లి, చెల్లిని ఇంటి నుంచి గంటెసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. మద్యపాన నిషేధం పై మాట తప్పి మడమతిప్పి విషపూరిత మద్యం పోసి పేదల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచాడని గుర్తుచేశారు. మెగా డీఎస్సీ హామీపై మాట తప్పి యువతకు, అన్న క్యాంటీన్లు రద్దుచేసి పేదలను కార్మికులను వెన్నుపోటు పొడిచాడన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే నాలుగు వేల పింఛన్ పెంచి అమలు చేశామని, నెలకు రూ. 2720 కోట్లు ఏడాదిలో రూ 34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 16.347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నామని, దీపం 2 కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఇప్పటికె కోటి సిలిండర్లు ఇచ్చాం ఈ పథకం కోసం ఏడాదికి రూ. 2684 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికీ రూ 1200 కోట్లు ఖర్చు చేసి 20 వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని, మళ్లీ వర్షాలు వచ్చాయి దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తాం ఇది నిరంతర ప్రక్రియ గత ప్రభుత్వం లాగా వదిలేయమన్నారు.203 అన్న క్యాంటీన్లను తెరిచి, 21 దేవాలయాల్లో నిత్య అన్నదానం చేస్తున్నామని, చెత్త పన్ను రద్దు చేశామని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకు 3 కిలో వాట్లకు గాను మొత్తం 98 వేలు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అసలైన వెన్నుపోటు దారుడు జగన్ రెడ్డి వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని, జగన్ ముఠా దుష్ప్రచారాలు తిప్పి కొట్టి అభివృద్ధి సంక్షేమాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :