నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 26 ః తంబళ్లపల్లె మండలం లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లపై సిబ్బంది దృష్టి సారించాలని విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె విద్యుత్ సెక్షన్ ఆఫీస్ తో పాటు సబ్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు వర్షాకాలం విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. భారీ వర్షాలతో విద్యుత్ సమస్యలు ఏర్పడితే ఎప్పటికప్పుడు మరమ్మత్తులకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ట్రిప్పింగ్ లేకుండా చూడాలని అదేవిధంగా కేటగిరి 1 వినియోగదారులకు అడిషనల్ లోడ్ కు రూ 1250 చెల్లించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ సిబ్బంది రైతులకు, వినియోగదారులకు అందుబాటులో ఉండి సహకరించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు అప్పిరెడ్డి, శంకర, నాగేంద్ర, ఇంతియాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News