Thursday, 16 April 2026 08:31:51 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి వాల్మీకి మహాసేన డిమాండ్

శుక్రవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వాల్మీకి మహాసేన

Date : 11 October 2024 02:24 PM Views : 417

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి వాల్మీకి మహాసేన డిమాండ్ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి మహాసేన డిమాండ్ చేసింది. శుక్రవారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మహాసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరికృష్ణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, నల్లబోతుల సుదర్శన బాబు లు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు ఈ నెల 17వ తేదిన ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వాల్మీకి విగ్రహాలకు పాలాభిషేకం, పులాభిషేకం చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సర్వ జన బోధన ఆసుపత్రి నందు రోగులకు బ్రేడ్ పండ్లు పంపిణి చెస్తామని తెలిపారు. అలాగే చిత్తూరు బస్టాండ్ వాల్మీకి సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగు తుందని తెలిపారు. ప్రాంతీయ వ్యత్యాసం తొలగించే వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో పునరుద్ధ రించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లోనూ ప్రతి యేటా వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలని, జనాభా ప్రాతి పదికన ఎమ్మెల్యే సీట్లు, నామినేటెడ్ పదవులతో పాటు వాల్మీకుల న్యాయమైన కోర్కెలు తీర్చాలన్నారు. వాల్మీకుల వృద్ధాప్య ఆశ్రమానికి స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమం లో వాల్మీకి మహాసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముత్తరాశి హరికృష్ణ జిల్లా అధ్యక్షులు బోగిటి కృష్ణమూర్తి, రాష్ట్ర నాయకులు వై.విజయకుమార్, జిల్లా నాయకులు ముత్త రాసి రవి, మునస్వామి, మదనపల్లి నియోజకవర్గ నాయకులు శ్రీనివాసులు, బొగ్గెటి చంద్ర, బంగారు శంకర లు పాల్గొన్నారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి వాల్మీకి మహాసేన డిమాండ్

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :