నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 25 : మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లె నందు మహిళలపై హింస నిర్మూలన కోసం ర్యాలీ ని నిర్వహించారు. కళాశాల లోని మిట్స్ సోషల్ రెస్పాన్సిబుల్ క్లబ్ వారు కళాశాల ప్రాంగణం లో ఈ ర్యాలీ ని నిర్వహించారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం టెక్నాలజీ పరంగా గాని, ఆర్థికంగా గాని, అభివృద్ధిలో గాని, ఇతర అంశాలలో మనం ఎంతో పురోగతి సాధించామని, కానీ మహిళలపై హింసాత్మక చర్యలు రకరకాలుగా ఇప్పటికీ చూస్తూనేఉన్నాం అని అన్నారు. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక హింస, సైబర్ నేరాలు, మానసికంగా వేధించడం వంటి అంశాలతో పాటు మహిళల ఆర్థిక పురోభివృద్ధి, సాధికారత, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితరాలపై అవగాహన కల్పించడం ఈ ర్యాలీ యెక్క ముఖ్య ఉదేశ్యం అని అన్నారు. కార్యకమం లో విద్యార్థులు, క్లబ్ కో ఆర్డినేటర్ షాయీజ్ అహమ్మద్, సాక్ కో ఆర్డినేటర్ డాక్టర్ జి. రెడ్డి హేమంతా తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News